వెనక్కు తగ్గిన కత్తి.. వివాదం సమసినట్లేనా?

గత కొన్ని నెలలుగా మీడియాలో పవన్‌ కళ్యాణ్‌పై కత్తి మహేష్‌ చేస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లే అంటూ ఒక వర్గం వారు అంచనా వేస్తున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ కొందరు ఇటీవల కత్తి మహేష్‌పై కోడిగుడ్లతో దాడి చేసిన విషయం తెల్సిందే. దాంతో కత్తి మహేష్‌ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మాదాపూర్‌ పోలీసులు కేసు ఎంక్వౌరీ మొదలు పెట్టారు. ఈ సమయంలోనే కత్తి మహేష్‌ ఒక మీడియా ఛానల్‌ ఆద్వర్యంలో పవన్‌ ఫ్యాన్స్‌తో రాజీ కుదర్చడం జరిగింది. కత్తి మహేష్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వాపస్‌ తీసుకోవడంతో వివాదంకు ఒక ఫుల్‌స్టాప్‌ పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

మరో వైపు జనసేన పార్టీ కార్యయం నుండి కూడా ఒక పత్రిక ప్రకటన విడుదల అయ్యింది. కత్తి మహేష్‌పై దాడి విషయంలో ఆ ప్రకటనలో స్పందించడం జరిగింది. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు ఓర్పుతో ఉండాలని, పార్టీని బలహీనం చేసేందుకు ఎవరైనా చేసే విమర్శలకు స్పందించక్కర్లేదు అంటూ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. దాంతో కత్తి మహేష్‌పై ఇక నుండి పవన్‌ ఫ్యాన్స్‌ మరియు జనసేన కార్యకర్తలు సైలెంట్‌గా ఉండే అవకాశం ఉంది.

ఇకపై అయినా ఈ వివాదంకు ఫుల్‌ స్టాప్‌ పడుతుందేమో చూడాలి. కత్తి మహేష్‌ గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో చేస్తున్న విమర్శలతో పవన్‌ ఫ్యాన్స్‌ రెచ్చి పోతున్నారు. కత్తి సైలెంట్‌ అయితే ఫ్యాన్స్‌ కూడా సైలెంట్‌ అయ్యే అవకాశం ఉంది.