Site icon TeluguMirchi.com

పవన్ వర్సస్ చిరు !!

pawan chiru

రాజకీయంగా మెగాబ్రదర్స్ ఢీ.. అంటే.. ఢీ అంటున్నారు. పోటాపోటీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో.. మెగా అభిమానుల్లో అయోమయం నెలకొంది. ఎటువైపు వుండాలో.. ఎవరికి జై కొట్టాలో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలే ’జనసేన పార్టీ’ కి ప్రాణం పోసిన పవన్ విశాఖలో తొలి బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇక, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రాణం పోసే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు చిరు.

’కాంగ్రెస్ హఠావో.. దేశ్ కో బచావో’ అని పవన్ ఇప్పటికే పిలుపునిచ్చారు. మరోవైపు, కాంగ్రెస్ కు ప్రాణం పోయండి.. హస్తం తో అభివృద్ధి సాద్యమని చిరు ప్రాధేయపడుతున్నాడు. ఈ నేపథ్యంలో.. పవన్ – చిరు సంపూర్ణమైన రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. అక్కడితో ఆగకుండా.. ఎత్తుకు పై ఎత్తులు వేయడం కూడా మొదలెట్టారు. తాజాగా, నేడు విశాఖలో పవన్ తొలి బహిరంగ సభను నిర్వహిస్తున్నాడు. తమ్ముడికి ధీటుగా చిరు హైదరాబాద్ లో యువత రాష్ట్ర స్థాయి భేటీకి శ్రీకారం చుట్టారు.

మెగా బ్రదర్స్ రాజకీయ చదరంగంలో.. మెగా బ్రదర్స్ ఎటువైపు? పవన్ – చిరులలో పై చేయి ఎవరిది కానుంది??.. తదితర విషయాలపై స్పష్టత రావాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సింది. మొత్తానికి.. మెగా వార్ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

 

 

 

 

Exit mobile version