దేశం అంతా ఒక్కటే, దేశంలోని ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వంకు ఒక్కటే అవ్వాలి. కాని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఉత్తరాదిపై కాస్త అధిక ప్రేమను ఎప్పుడూ చూపుతూనే ఉంటుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలపై ఏ పార్టీ ప్రభుత్వాలకు అయినా చిన్న చూపే అంటూ పలువురు మేదావులు గత కొంత కాలంగా ఆగ్రహం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ నేత విజయ్ తరుణ్ చేసిన సౌత్ ఇండియన్స్ నల్లవారు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
మొదటి నుండి కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వాదిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ నల్లవారు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు. నల్లగా ఉన్నవన్ని వారికి వద్దనుకుంటున్నారేమో. అయితే నల్లగా ఉన్న కోయిలను బ్యాన్ చేయాలి. నల్లని వారు ఇచ్చే రెవిన్యూ మీకు కావాలా అంటూ పవన్ ప్రశ్నించాడు. ఈ రకంగా ప్రవర్తించే వ్యక్తులను మరియు వారికి చోటు ఇచ్చే పార్టీలు దేశంలో ఉండటం మన దౌర్భాగ్యం అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. ఇంకా పలు సౌత్ ఇండియన్స్ కూడా ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.