తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిధిలో పనిచేస్తున్న 1300 మంది పారిశుద్ధ్య సిబ్బందికి తాత్కాలిక ఊరట కల్పించడంపై ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కార్మికుల సేవలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై తితిదే బోర్డు, ప్రభుత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకుని తితిదే పాలకవర్గం, అధికారులు మానవత్వాన్ని చాటుకున్నారన్నారు.
కాగ 1400 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులను తొలగించడంపై నిన్న పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా కష్టకాలంలో ఎవరినీ ఉద్యోగం నుండి తొలగించడం కానీ, వేతనాలు తగ్గించడం చేయకూడనికి స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించినా టీడీపీ పెద్దలు మాత్రంఉద్యోగులను తొలగించడం సరికాదని ఆయన నిన్న ట్వీట్ చేశారు.