పవన్ ప్రసంగం ఎవరికి గుచ్చుకుంటుంది..???

pavanపవన్ కళ్యాణ్ రాజకీయ తెరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. ఈరోజు (శుక్రవారం) రాత్రి ’జనసేన’ పేరుతో ప్రారంభించే పార్టీ సిద్ధాంతాలను, తన రాజకీయ ఆలోచనలను అభిమానుల సమక్షంలో పవన్ వెల్లడించనున్నారు. ఇందుకు ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఇప్పటికే జనసేన పార్టీ జెండా, ప్రోమోసాంగ్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక, అందరి దృష్టి పవన్ ప్రసంగంపైనే నెలకొంది. దాదాపు గంటపాటు పవన్ ప్రసంగం కొనసాగే అవకాశాలున్నాయి.

ఇప్పటికే సాధారణ ఎన్నికలకు నోటీఫికేషన్ వచ్చేసింది. ఎన్నికలకు పట్టుమని నెలరోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో.. పవన్ జనసేన పేరుతో పార్టీని నెలకొల్పడం పట్ల అన్ని రాజకీయ పార్టీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. పవన్ ను ఆహ్వానించడమా..?? వ్యతిరేకించడమా..?? ఏదో ఒకటి చేయడానికి వారు రెడీ అవుతున్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాతనే పవన్ పార్టీ ప్రకటన చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టి పవన్ ప్రసంగంపైనే నెలకొంది. మరికొన్ని గంటల్లో పవన్ ప్రసంగించనున్నారు. పవన్ ప్రసంగం ఎవరిని ప్రశ్నిస్తుంది..?? ఎవరికి గుచ్చుకుంటుంది..?? ఎవరిని సంతోష పెడుతుంది?? ఎవరికి సవాల్ విసురుతుంది..?? మరెవరికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది..??? తదితర ప్రశ్నలకు సమాధానం దొరకాలంతే.. కాస్త వేచి చూడాల్సిందే.