పవన్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం!!

pawankalyan(1)పవన్ కళ్యాణ్ ’జనసేన పార్టీ’ని రేపే (శుక్రవారం) అధికారంగా ప్రకటించనున్నారు. హైదరాబాద్ మాదాపూర్ లోని హైటెక్స్ లో జరిగే సమావేశంలో పవన్ స్వయంగా పార్టీపై ప్రకటన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణలోని 28 కేంద్రాల్లో పవన్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఎలాంటి ఆర్భాటం లేకుండా.. వన్ మ్యాన్ షో తో పురుడు పోసుకోనున్న ’జనసేన పార్టీ’ ఏ తరహా చరిత్ర సృష్టిస్తుందోనని అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక, ఇప్పుడు అందరి దృష్టి పవన్ ప్రసంగంపైనే నెలకొంది. పవన్ ఏం మాట్లాడుతాడు..? రాజకీయాలపై పవన్ అభిప్రాయాలు ఎలా వుండబోతున్నాయా.. ?? జనసేన పార్టీ జెండా-అజెండా ఏమిటి??? తదితర పశ్నలు అటు ఆయన అభిమానులను, ఇటు ప్రజలను తొలచివేస్తున్నాయి. వీటన్నింటికి సమాధానం దొరకాలంటే పవన్ మీడియా ముందుకు రావాల్సిందే. అందుకు ఇంకో రోజు ఆగాల్సిందే.. !!

పవన్ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రాసారాలు అయ్యే ప్రాంతాల వివరాలు : 

pawan-pressmeet-live