Site icon TeluguMirchi.com

పవన్ పవర్ ఫుల్ ’పంచ్’ లు !

pawan

సీమాంధ్రలో పవన్ పంచ్ డైలాగ్ లు బాగానే పేలాయి. పవన్ ప్రసంగానికి సీమాంధ్రలో విశేషమైన స్పందన వస్తోంది. తెలంగాణ ప్రాంతంతో పోలిస్తే.. సీమాంధ్రలో పవన్ కార్డ్ బాగానే పనిచేస్తోంది. అభివృద్ధి, అవినీతిపై నిజాయితీగా పవన్ చేసిన ప్రసంగానికి సీమాంధ్ర పజలు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా వైకాపా అధినేత వైఎస్ జగన్ పై పవన్ చేసిన అటాక్ జనాన్ని విపరీతంగా ఆకర్శిస్తోంది.

రాష్ట్రాన్ని ఇప్పటికే జగన్ దోసేశాడు.. రేపటి ఎన్నికల్లో ఆయన్ను గెలిపించి అధికార పీఠం ఎక్కిస్తే దొంగల రాజ్యంగా మారుస్తాడని పవన్ అన్నారు. సీమాంధ్రలో మోడీ, చంద్రబాబు, పవన్ లు చేసిన సుడిగాలి పర్యటనతో వైకాపా కుదేలైంది. పవన్ వేసిన పంచ్ లకు వారి దగ్గర సమాధానం కరువైంది. కేసీఆర్-జగన్ ది అన్నదమ్ముల బంధమన్న పవన్ వ్యాఖ్యలు సీమాంధ్ర ప్రజలను ఆలోజింపచేశాయి. జగన్-కేసీఆర్ ఏనాడు తిట్టుకోరని, సీమాంధ్ర పౌరుషం లేని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశాడు పవన్. వైకాపా హఠావో.. సీమాంధ్ర బచావో అని పవన్ పిలుపునిచ్చారు. మొత్తానికి భాజాపా-తెదేపా కూటమికి విన్ కార్డ్ లా పవన్ దొరికాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version