ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ మెల్లగా పావులు కదుపుతున్నాడు. తాజాగా పవన్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఏపీకి హోదాను తీసుకు వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే ఉండవల్లి మరియు జేపీలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఈనెల 16న కీలక భేటీ నిర్వహించబోతున్నారు. ఆ భేటీకి ఏపీ కామ్రెడ్ నాయకులు హాజరు కాబోతున్నారు.
నేడు స్వయంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మరియు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలకు పవన్ ఫోన్ చేశాడు. ఈనెల 16న జరుగబోతున్న జేఎఫ్‌ఎఫ్‌సి భేటీకి హాజరు కావాలని కోరడం జరిగింది. అందుకు వారిద్దరు కూడా సుముఖత వ్యక్తం చేశారని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం వారు చేస్తున్న పోరాటంలో ఇది ఒక భాగం కానుందని రాజకీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక హోదా వేడి జోరుగా సాగుతుంది. ఈ సమయంలోనే పవన్ జేఎఫ్‌ఎఫ్‌సి ద్వారా రాజకీయ భేటీలు జరుపబోతున్నారు.