Site icon TeluguMirchi.com

పవన్ పార్టీ పేరు ’జనసేన’.. !!

qqqపవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ పెట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. పవన్ పార్టీ పేరు ’జనసేన’ గా ప్రచారం జరుగుతోంది. ’జనసేన’ పేరు ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ లో రిజిస్టర్ అయింది. ఇక, జనసేన పేరును పవన్ అధికారికంగా ప్రకటించడమే తరువాయి. పవన్ ప్రస్తుతం పార్టీ ప్రకటనకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై వున్నట్లు సమాచారమ్. ఈ నెల 14న హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో పవన్ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. జనాన్ని విపరీతంగా ఆకర్షించే విధంగా పవన్ పార్టీ ’జనసేన’గా వుండటం పట్ల ఆయన ఆత్మీయులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ గొంతుతో ’జనసేన’ పేరును వినాలని ఆతృతగా ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Exit mobile version