ఇలా వేధించడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్


రాష్ట్రంలో కరోనా విజృంభణతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజదాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. మేరకు ఆయన ట్విట్‌ చేశారు.

కష్టాల్లో ఉన్నవారిని కేసుల పేరిట వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. కరోనా కాలంలోనూ సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని.. వారిని పాత కేసుల పేరుతో పోలీస్ స్టేషన్‌లకు తీసుకువెళ్లడం తగదన్నారు

లాక్‌డౌన్‌ సమయంలోనే సీఆర్డీయే మాస్టర్ ప్లాన్‌లో ఆర్-5 జోన్ నిబంధనలు చేర్చి.. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామనడం వారిని మానసిక ఆందోళనకు గురిచేయడమే అవుతుందదని అభిప్రాయపడ్డారు.