బాబు ప్రమాణానికి పవన్!

pawan-and-chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 8న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు సమాచారమ్. తెదేపా బృందం స్వయంగా పవన్ కళ్యాణ్ ను కలసి బాబు ప్రమాణానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అందుకు పవన్ కూడా అంగీకరించాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా, తెదేపా-భాజాపా కూటమి తరుపున పవన్ విస్తృతంగా ప్రచారం చేసి.. తెదేపా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మరోవైపు, బాబు ప్రమాణానికి జూ. ఎన్టీఆర్ కుడా హాజరుకానున్నట్లు సమాచారమ్. జూనియర్ తో పాటుగా అయన కుటుంబ సభ్యులు బాబు ప్రమాణానికి రానున్నారు. మొత్తానికి.. బాబు ప్రమాణ స్వీకార వేదిక పొలిటికల్ పవర్ తోపాటు.. సినీ గ్లామర్ తో నిండిపోనుంది.