రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి జనసేనాని జై

ఏపీకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీ సాధన కోసం ప్రజా సంఘాలు మరియు నాయకులు రేపు విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలో హాజరు కావాల్సిందిగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌కు సైతం ఆహ్వానం అందింది. అయితే కొన్ని కారణాల వల్ల పవన్‌ కళ్యాణ్‌ హాజరు కావడం లేదు. అయితే విజయవాడలో జరుగబోతున్న హక్కు సాధన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి తన మద్దతును తెలిపాడు.

ఈ సమావేశం ఏపీలో ఉన్న అయిదు కోట్ల మంది ప్రజల గొంతుక కావాలని అంటూ పవన్‌ కోరుకున్నాడు. తమ పార్టీ పూర్తి మద్దతును రౌండ్‌ టేబుల్‌కు ఇస్తున్నట్లుగా ఈ సందర్బంగా పవన్‌ పేర్కొన్నాడు. ఈ సమావేశంలో తాను పాల్గొనలేక పోయినా కూడా తమ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు అంటూ పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంను నిర్వహించ తలపెట్టిన ప్రతి ఒక్కరికి పవన్‌ అభినందనలు తెలియజేశాడు. నిన్న, నేడు పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ప్రత్యేక హోదా కోసమే జేఎఫ్‌సీ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెల్సిందే. మొత్తానికి ప్రత్యేక హోదా కోసం చేసే ప్రతి సమావేశానికి పవన్‌ తన పూర్తి సహకారంను పవన్‌ అందిస్తున్నారు.