బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏమాత్రం ప్రాతినిధ్యం ఇవ్వలేదని, కొత్త రాష్ట్రం ఏపీకి ఇచ్చిన హామీల గురించి కనీసం పట్టించుకోలేదంటూ గత నాలుగు రోజులుగా ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ విషయమై మాట్లాడిన నేపథ్యంలో ఏపీకి ఏమైనా వరాలు ఇచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా ఒక్కటి కూడా మోడీ వరాన్ని ఇవ్వక పోవడంతో ఏపీకి చెందిన అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఏపీలో కీలక పాత్ర పోషించబోతుందని భావిస్తున్న జనసేన కూడా రేపటి బంద్‌కు మద్దతుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. శాంతియుతంగా బంద్ జరగాలని, ప్రజల ఆకాంక్ష కేంద్రానికి తెలియాలి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. మొదటి సారి జనసేన పార్టీ బంద్‌కు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఏపీ మొత్తం బంద్ సంపూర్ణంగా జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. పవన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు జాక్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.