సత్తెనపల్లి సభకి బయలుదేరిన పవన్ కళ్యాణ్


జనసేన ఈ రోజు నిర్వహించే కౌలు రైతు భరోసా యాత్ర సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఏటుకూరు, నల్లపాడు కూడళ్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, ధూళిపాల గ్రామంలో మధ్యాహ్నం జనసేన కౌలు రైతు భరోసా యాత్ర జరుగనుంది. అంతకుముందు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ నుంచి కొందరు ముఖ్య నాయకులు జనసేన పార్టీలోకి చేరారు. వారిని పవన్‌ కళ్యాణ్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.