పవన్‌ ప్రజా యాత్రలో జాతీయజెండాకు అవమానం

పవన్‌ కళ్యాణ్‌కు దేశ భక్తి ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయం గతంలో పలు సందర్బాల్లో వెళ్లడైంది. తాజాగా మరోసారి ఆ విషయాన్ని చెప్పనక్కర్లేదు. కాని తాజాగా ఆయన జగిత్యాల జిల్లా కొండగట్టు దేవాలయం నుండి తన ప్రజాయాత్రను మొదలు పెట్టడం జరిగింది. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఓణమాలు దిద్దుతున్న పవన్‌ కళ్యాణ్‌కు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఆయన అభిమానుల కారణంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా కొండగట్టు వద్ద పవన్‌ కళ్యాణ్‌ కోసం వచ్చిన అభిమానులు జాతీయ జెండా మరియు జనసేన జెండాలను పట్టుకుని వచ్చారు.

జాతీయ జెండాను కొందరు వ్యక్తులు చించి పవన్‌పైకి వేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ జాతీయ జెండాను పట్టుకుని పక్కకు పెట్టేశాడు. ఆ క్రమంలో జాతీయ జెండాను ముద్దగా చేసి కొద్ది సమయం చేతులో పట్టుకుని ఆ తర్వాత కారులోకి ఆ జెండాను విసిరేయడం జరిగింది. అది కాస్త మీడియా కెమెరాకు చిక్కింది. దాంతో పవన్‌ యాత్రపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పవన్‌ అభిమానులను అదుపులో పెట్టుకోలేడు, ఆయన పర్యటిస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం పెద్దది అవుతుందా లేదా ఇక్కడితో ముగుస్తుందో చూడాలి.