విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విశాఖలో తరచు ప్రమాదాలు జరగడంపై అధికారులు కారణాలను పరిశీలించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన వల్ల వేలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ఆరుగురు వరకు మరణించారని, వందలాది పశువులు ఇప్పటికే చనిపోయినట్టు తెలుస్తోంది. కంపెనీనుంచి గ్యాస్ లీక్ కావడంపై స్థానికులు మండిపడుతున్నారు. కంపెనీ ఎలాంటి సేఫ్టీ తీసుకోలేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఈ కంపెనీ నుంచి లీకైన ఈ గ్యాస్ ప్రజలపై షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు.