లాక్ డౌన్ ని మంటగలిపిన జగన్ ప్రభుత్వం


‘‘సంపూర్ణ మద్య నిషేధం అని అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం కరోనా విపత్తు ఉంటే మద్యం అమ్మకాలను ఆపలేదా? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం ఆయా దుకాణాల వద్ద ఉపాధ్యాయులను ఉంచడం విడ్డురంని ‌ ఆవేదన వ్యక్తంచేశారు.

భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులకు ఇవేం విధులని ప్రశ్నించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకో, పేదలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం వంటి వాటిని పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులు ఉపయోగించుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆలయాలు, మసీదులు, చర్చీలకు వెళ్లకుండా.. పండుగలు చేసుకోకుండా నియబద్ధంగా ఉంటే.. ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలు తెరవడం ద్వారా ఇంతకాలం పాటించిన లాక్ డౌన్ నియమాలను, ఆ స్ఫూర్తిని మంటగలిపిందని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్.