ఇటీవలే ఏపీకి ప్రత్యేక హోదా కోసం జాక్‌ను ఏర్పాటు చేస్తాను అంటూ ప్రకటించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే ఏపీకి చెందిన కొందరు ముఖ్య నేతలతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. జాక్ ఏర్పాటు చేసిన తర్వాత దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వంకు నిరసనగా, మోడీ హామీని నిలబెట్టుకోవాలి అంటూ జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు పూనకుంటే కేంద్రం దిగిరావాల్సిందే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ నిరాహార దీక్ష చేస్తే తాను మద్దతు ఇస్తాను అంటూ ఇప్పటికే కత్తి మహేష్ ప్రకటించిన విషయం తెల్సిందే.