Site icon TeluguMirchi.com

చంద్రబాబుతో పవన్ మంతనాలు

pawan-and-babu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెదేపా అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు. చంద్రబాబు నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో వీరిరువు పలు అంశాలపై చర్చించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. రేపు (మంగళవారం) హైదరాబాద్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలసి వేదికను పంచుకోనున్న నేపథ్యంలో.. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకొంది. కాగా, భాజాపా-తెదేపా కూటమికి సంపూర్ణ మద్ధతును ప్రకటించిన పవన్.. రాష్ట్రంలో మోడీ పాల్గొనబోయే అన్ని సభలకు హారజరవుతానని వెల్లడించిన విషయం తెలిసిందే.

Exit mobile version