ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైడ్డింగ్ కమిటి రేపు కీలక భేటీ కానుకంది. ఈ భేటీలో భవిష్యత్తు కార్యచరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకు రావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ జనసేన తరపున పాల్గొనబోతుండగా, కాంగ్రెస్ మరియు వామపక్ష నాయకులు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ భేటీ తర్వాత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలా వత్తిడి తీసుకు రావాలనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ భేటీతో ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లవుతుందని, ఖచ్చితంగా భవిష్యత్తులో జేఎఫ్‌ఎఫ్‌సి కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ముఖ్యమైన మూడు పార్టీలు టీడీపీ, బీజేపీ, వైకాపాలు లేకుండా వారు సాధించేది ఏంటీ? ఆ కమిటీ వల్ల ఉపయోగం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై కొందరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాడనే నమ్మకం ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతుంది.