ప‌వ‌న్ క‌ల్యాణ్‌… చంద్రబాబుని క‌లిశాడా??

pawan-kalyan-chandrababuరాష్ట్రానికి ఓ పొలిటికల్ షాక్‌!!
ప‌వ‌ర్ స్టార్… పొలిటిక‌ల్ స్టార్‌ గా ఎద‌గ‌డానికి చూస్తున్నాడా??

అన్న చిరుకి వెన్నులో చ‌లి పుట్టించేందుకు తెర వెనుక నుంచి త‌తంగం న‌డుస్తోందా??
తెలుగు మిర్చి ఈ ప్రశ్నల‌కు సమాధానం చేధించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అత్యంత స‌న్నిహితుల నుంచీ, తెలుగుదేశం పార్టీ విశ్వస‌నీయ వ‌ర్గాల నుంచి సేక‌రించిన స‌మాచారం ప్రకారం ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియాశీల రాజ‌కీయాల‌వైపు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. అదీ అన్న ఏలుతున్న కాంగ్రెస్ పార్టీవైపుకి కాదు… వ్యతిరేక వ‌ర్గం తెలుగుదేశం పార్టీవైపుకి. ఇందుకు సంబంధించి తెలుగు మిర్చి ఓ కీల‌క స‌మాచారం సేక‌రించింది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ చంద్రబాబు నాయుడిని క‌లిశార‌ట‌. వీరిద్దరి మ‌ధ్య దాదాపుగా గంట పాటు చ‌ర్చలు జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఈ స‌మయంలో ప‌వ‌న్‌ తో పాటు… అన్న నాగ‌బాబు కూడా ఉన్నట్టు స‌మాచార‌మ్‌. ఇటీవ‌ల చంద్రబాబు సుదీర్ఘమైన పాదయాత్రని ముగించుకొని వ‌చ్చిన సంద‌ర్భంగా మ‌ర్యాద పూర్వకంగా క‌లుసుకొన్నప్పటికీ వారి మ‌ధ్య రాజ‌కీయాలకు సంబంధించిన విష‌యాలు కూడా చ‌ర్చకు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. `మీలాంటి వాళ్లు వ‌స్తే పార్టీకి బ‌లం..` అని చంద్రబాబు నాయుడు చూచాయిగా అంటే… వెంట‌నే ప‌వ‌న్ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం నుంచి పోటీ చేస్తా.. అంటూ ప‌వ‌న్ అడిగార‌ట‌. వెంట‌నే బాబు కూడా ప‌వ‌న్‌ కి ప‌చ్చజెండా ఊపిన‌ట్టు స‌మాచారమ్‌. ఇదే గ‌నుక నిజ‌మైతే టీడీపీకి బూస్ట్ దొరికిన‌ట్టే.

చిరంజీవి పీఆర్పీ స్థాపించిన‌ప్పుడు అన్నపై ఉన్న ప్రేమ‌తో ఆ పార్టీ యువ‌సేన‌కు అధ్యక్షుడిగా వ్యవ‌హ‌రించాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప్రచారంలో కూడా జోరుగా పాల్గొన్నాడు. కాంగ్రెస్ నాయ‌కుల్ని పంచ‌లూడ‌దీసి కొడ‌తా.. అంటూ ఘూటైన ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తిట్టిన పార్టీలోకే చిరు జంప్ అయ్యాడు. దాంతో ప‌వ‌న్ తీవ్ర మ‌న‌స్తాపినికి గుర‌య్యాడు. ముందు నుంచీ ప‌వ‌న్ వ్యక్తిత్వం విభిన్నం. ఎవ‌రి కోస‌మూ.. త‌న అభిప్రాయాల‌ను మార్చుకోడు. అన్న కాంగ్రెస్ లోకి వెళ్లాడ‌ని త‌మ్ముడు మూడు రంగుల జెండా ప‌ట్టుకోలేదు. త‌న ఆశ‌యాలు, ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే వ్యవ‌హ‌రించాడు. చిరు ప్లేటు పిరాయించిన త‌ర‌వాత అన్నద‌మ్ముల మ‌ధ్య మాట‌లు కూడా లేవ‌ని తెలిసింది. ఏదో ముక్తస‌రిగా క‌లుసుకొంటున్నారంతే!

ఇప్పుడు ప‌వ‌న్ భావ‌జాల‌మే.. త‌న‌ని టీడీపీ వైపుకు వెళ్లేలా చేస్తోంద‌ని స‌మాచార‌మ్‌. కాంగ్రెస్‌కు పోటీగా నిలిచేది.. టీడీపీనే అని ప‌వ‌న్ భావిస్తున్నాడు. అందుకే.. చంద్రబాబుతో మంత‌నాలు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాక త‌ప్పకుండా టీడీపీకి మాన‌సిక ధైర్యాన్ని ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు. కానీ ఒక‌టే స‌మ‌స్య‌. ప‌వ‌న్ అడుగుతున్న బంద‌రు సీటు పొన‌క‌ల్ల నారాయ‌ణ‌రావుది చంద్రబాబు నాయుడికి అత్యంత స‌న్నిహితుడు, ప్రీతిపాత్రుడీయ‌న‌. బందరు సీటు ఆయ‌న‌కు దాదాపు ఖాయ‌మైంది. ఇప్పుడు ప‌వ‌న్ అదే సీటు డిమాండ్ చేస్తున్నాడు. మ‌రి ప‌వ‌న్ కోసం ఆ సీటు పొన‌క‌ల్ల త్యాగం చేస్తాడా? నిజంగా ప‌వ‌న్ రాజ‌కీయ ప్రవేశం సాధ్యమ‌య్యే విష‌య‌మేనా? బాల‌కృష్ఱ‌, ఎన్టీఆర్ ల‌తో క‌లిసి ప‌వ‌న్ టీడీపీ ప‌క్షాన నిలిచి… ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? అది ప్రభంజ‌న‌మే క‌దూ. ఈ అద్భుతం సాధ్యమ‌య్యే రోజు ఎప్పుడో??

Click here to read this article in English Version