‘ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా? అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈలు ఇవ్వకుండా వైరస్‌తో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదు” అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపుతున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసినా ఆ రోగులకు వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. వైద్యులు, సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్య సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమతో పాటు తమ కుటుంబం ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తున్న వారి సేవలను గుర్తించాలని, వారిని ఆపదలోకి నెట్టేయకుండా అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలి’ అని ఏపీ ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్.