ఈ యాత్రలో పార్టీని బలోపేతం చేస్తాడు అంటూ పవన్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే పవన్ గతంలో కూడా యాత్రలు చేసినప్పుడు పార్టీ బలోపేతంకు కృషి చేస్తాడని, జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కాని పలు సార్లు కూడా అందరి అంచనాలను తారు మారు చేయడం, పవన్ మళ్లీ సినిమాలతో బిజీ అవ్వడం చేశాడు.
ఈసారి కూడా పవన్ మళ్లీ సినిమాలు అంటాడేమో అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాని 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ ఈసారి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం తప్పకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. మొదట తెలంగాణలో ఈ ప్రజాయాత్ర ప్రారంభించినప్పటికి ఏపీలో కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను అంటూ పవన్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ నాయకుల్లో మరియు విశ్లేషకుల్లో ప్రస్తుతం చర్చ మొదలైంది.