అమ్ ఆద్మీ పార్టీలోకి పవన్.. ?

pavanదేశ రాజధాని ఢిల్లీలో వున్న చెత్తను వూడ్చేయడానికి చీపురు పట్టింది క్రేజివాల్ సారథ్యంలోని అమ్ ఆద్మీ పార్టీ. అందులో చాలా వరకు విజయం సాధించందనే చెప్పాలి. కాంగ్రెస్ కోరలు పీకి అధికారానికి దూరం చేసింది. కేవలం… ఢిల్లీలోనేనా చెత్త వుండేది..? ఆ మాట కోసం ప్రతి రాష్ట్రంలోనూ చెత్త (అవినీతి) నెలకొంది. ఇందులో ఆంధ్రపదేశ్ కూడా ఒకటి. మరీ.. ఆంధ్రపదేశ్ లో పేరుకుపోయిన చెత్తను వూడ్చేందుకు నడుంబిగించేదెవరు.. ? అంటే.. ఇంకెవరూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ అంటున్నారు ఆయన అభిమానులు.

తాజాగా, ఆంధ్రపదేశ్ లోని అవినీతి చెత్తను వూడ్చేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం రాజకీయవర్గాలో జోరుగా సాగుతోంది. అవినీతి నిర్మూలించడం, సామాన్యుడి అభివృద్ధికి పాటుపడటం, నిజాయితీ అనే అంశాలే పవన్ అమ్ అద్మీ వైపు చూసేలా చేశాయని చెబుతున్నారు. పవన్ కు నిజాయితీ పరుడు అనే మంచి పేరుంది. ఇప్పటికే పవన్ ’కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ అనే సామాజిక సంస్థ కూడా నిర్వహిస్తున్నారు.

గతంలో.. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పవన్ క్రీయాశీల పాత్ర పోషించారు. ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం పవన్ రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. పవన్ తెదేపాలో చేరబోతున్నారంటూ.. ఇటీవలే జోరుగా రూమర్స్ వచ్చినా.. దానిపై ఆయన స్పందించలేదు.

అవినీతిని పారద్రోలాలనే సంకల్పమున్న పవన్, తన ఆలోచనలకు దగ్గరగా వున్న క్రేజివాల్ అమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారమ్. పవన్ చీపురు పట్టి రాష్ట్రంలో అవినీతి వూడ్చడానికి సిద్దమైతే.. ఆయన వెనక నడవడానికి పవన్ అభిమానులు సైతం రెడీ గా వున్నారు. కాగా, ఆయన అభిమానులు మాత్రం పవన్ చీపురుపట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరీ.. దీనిపై పవన్ ఎపుడు క్లారీటీ ఇస్తాడో.. ?