సీఎం గా పవన్ కళ్యాణ్ ..?


జనసేనాని పవన్ కల్యాణ్‎కు బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందా? వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్ ను బీజేపీ నిలబెట్టాలని భావిస్తోందా..? అంటే అవుననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జనసేన, బీజేపీ పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. పవన్ కూడా గతంలో బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అయితే రెండు పార్టీలు పొత్తులో ఉన్నా.. కేడర్ మాత్రం కలవడం లేదు. నేతలు కూడా ఎవరిదారివారే అన్నట్లుగా ఉన్నారు. కానీ టీడీపీతో మాత్రం జనసేన కార్యకర్తలు మాత్రం టచ్ లో ఉన్నారనేది వాస్తవం. ఈ నేపథ్యంలో పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా కమలదళం యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందంటున్నారు. ఈనెల 6న ఏపీ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తమతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై జనసేన కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిందని..అందుకే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేగాక జనసేన-బీజేపీ కూటమిలోకి టీడీపీని రానివ్వడం బీజేపీకి ఇష్టం లేదని.., అందుకే ముందగానే పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీని అడ్డుకోవచ్చన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.