పవన్ రాష్ట్ర పర్యటన షెడ్యూల్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీలో పర్యటించబోతున్నాడు. ఈసారి పవన్ పర్యటన సుదీర్ఘంగా సాగనుందని చెబుతున్నారు. తాజాగా, రాష్ట్ర పర్యటనపై పవన్ స్పందించారు. త్వరలో ప్రజల మధ్యకు వస్తా. ఈ నెల 11న రాష్ట్ర పర్యటన వివరాలు వెల్లడిస్తానని పవన్ ప్రకటించారు.

బూత్‌ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తాం. తమ పార్టీకి అనుభవం లేకపోయినా, ప్రతి కార్యకర్తకు రెండు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. 2019 ఎన్నికల్లో ఎపిలోని 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. ఇక, తెలంగాణలో పోటీ ప్రణాళికను ఆగస్టులో వెల్లడిస్తానని పవన్ తెలిపారు.

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతి పక్ష నాయకుడు వైఎస్ జగన్ పోటాపోటీ సభలతో అదరగొట్టారు. మరోవైపు, ఈ మధ్య పవన్ పై టీడీపీ దాడి కూడా ఎక్కువైంది. వీటి నుంచి కాస్త ఉపశమనం కలిగించి.. కార్యకర్తల్లో జోష్ పెంచడానికి పవన్ రాష్ట్ర పర్యటనని అనుకొన్న సమయాని కంటే కాస్త ముందుగానే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్.