Site icon TeluguMirchi.com

ఊహాగానాలకు పులిస్టాప్ చెప్పిన పవన్.. !

pavankalyanపవర్ స్టార్ పవన్ కాళ్యాణ్ పొలిటికల్ దారికోసం వెతుకుతున్నాడని.. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ.. జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడని.. ముహూర్తం కూడా ఖరారైనట్లు ఇటు వెబ్ మీడియా, అటు టీవీ ఛానెల్స్ ఊదరగొట్టాయి. అయితే, వీటన్నింటిని పటాపంచలు చేస్తూ.. పవన్ సోదరుడు నాగాబాబు తాజాగా ఓ పత్రికా ప్రకటనను అంజనా ప్రొడక్షన్ లెటర్ హెడ్ పై విడుదల చేసి పవన్ పొలిటికల్ దారిపై నెలకొన్న సస్పెన్షన్ కు తెరదించారు.

నేను (నాగబాబు), పవన్ కళ్యాణ్ ఇరువురం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నామని జరుగుతున్న ప్రచారం లో నిజం లేదు. మమ్మల్ని సంప్రదించకుండా, మా వివరణ కోరకుండానే మీడియా ఇటువంటి కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడం భావ్యం కాదు. ప్రస్తుతం ఇద్దరం కూడా మా వృత్తిలో బిజీగా వున్నాము. అభిమానులు అర్థచేసుకుంటారని ఆశిస్తున్నామనేది నాగబాబు విడుదల చేసిన పత్రికా ప్రకటన సారాంశంగా కనిపిస్తోంది.

నాగబాబు విడుదల చేసిన పత్రిక ప్రకటన తెలుగు మిర్చి ప్రేక్షకుల కోసం :

Exit mobile version