Site icon TeluguMirchi.com

పవన్‌ నిర్ణయం అభినందనీయం

తెలంగాణ రాష్ట్ర సాధనకు అన్ని రాజకీయ పార్టీలను మరియు ప్రజాసంఘాలను, ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటి ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. కోదండరాం కన్వీనర్‌గా వ్యవహరించిన ఆ జాక్‌ పోరాటాల వల్ల తెలంగాణ సాధ్యం అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల వారు, అన్ని రాజకీయ పార్టీల వారు కూడా జాక్‌ ఆధ్వర్యంలో పోరాటం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఇప్పుడు అచ్చు అదే తరహాలో ఏపీకి ప్రత్యేక హోదాను సాధించుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ పిలుపునివ్వడం హర్షనీయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.

ఏపీకి ప్రత్యేక హోదాను సాధించేందుకు అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాని, అందుకే జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా పవన్‌ పేర్కొన్నాడు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల వారు, రైతు సంఘాల వారు, రాజకీయ నాయకులు ఇలా అన్ని వర్గాల వారు కూడా జాక్‌లో కలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యం కాదు అనేది కొందరి వాదన. ఈ జాక్‌ను పవన్‌ కళ్యాణ్‌ ముందు ఉండి నడిపించాలని కొందరు భావిస్తున్నారు. కాని పవన్‌ మాత్రం ఒక సీనియర్‌ నాయకుడికి జాక్‌ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మాట్లాడబోతున్నట్లుగా పవన్‌ ప్రకటించడంతో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి.

Exit mobile version