జనసేనాధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ సర్కార్ ఫై మండిపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఫై ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు.
ఎన్ని వాగ్దానాలు చేసినా ..ఎన్ని అరుపులు అరిచినా..రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా ..’సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు..పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు’ ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని ‘వైసీపీ ప్రభుత్వం’ మరిచినట్టుంది అంటూ ట్వీట్ చేసారు.
గత కొన్ని రోజులు గా వైసీపీ సర్కార్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ లో సినిమా టికెట్లు పెట్టే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్… అప్పటి నుంచి ఏపీ సర్కార్ పై వైఫల్యాలపై దృష్టి పెట్టారు. వైసీపీ సైతం పవన్ కళ్యాణ్ ఫై అదే రేంజ్ లో మాటల యుద్ధం చేస్తూ వస్తుంది. మరి ఇప్పుడు పవన్ చేసిన ట్వీట్ పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా
‘సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు’
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని ‘వైసీపీ ప్రభుత్వం’ మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9— Pawan Kalyan (@PawanKalyan) October 8, 2021