Site icon TeluguMirchi.com

బెనిఫిట్ షోస్ ఆపగలరు..కానీ పవన్ ఫై అభిమానాన్ని ఆపలేరు

జగన్ సర్కార్ ఫై పవన్ కళ్యాణ్ అభిమానులు , సినీ ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రానికి ఏపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వకపోవడం , టికెట్ ధరలు పెంచకపోవడం వంటివి చేస్తూ కక్ష్య సాధింపు చర్యలు చేస్తుంది. ఈ తరుణంలో పవన్‌కల్యాణ్‌ అభిమానులు విజయవాడలో నిరసనకు దిగారు.

జగన్‌ ప్రభుత్వం పవన్‌కల్యాణ్‌పై కావాలనే కక్ష సాధిస్తుందని అభిమానులు ఆరోపించారు. గత రెండు నెలలుగా లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకొచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక కక్ష సాధింస్తుందని ఆరోపిస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేమని, కుట్రపూరిత ప్రభుత్వం బెనిఫిట్‌ షోలు ఆపగలదు కానీ.. సినిమాను, పవన్‌కల్యాణ్‌ మీదున్న అభిమానానికి అడ్డుకట్ట వేయలేదు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం అని తేల్చి చెపుతున్నారు.

Exit mobile version