పవన్ ..ఎక్కడ అంటున్నారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటున్నారు ఏపీ ప్రజలు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా జనాలంతా ఇంటికే పరిమితమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉండిపోయాడు. జనతా కర్ఫ్యూ రోజు రాత్రి గంట కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రధాని మోడీ ప్రకటించిన లాక్ డౌన్ కి అందరూ సహకరించాలంటూ ఓ వీడియో సందేశాన్ని వదిలారు. అంతే.. ఆ తర్వాత పవన్ ఎక్కడా కనబడలేదు, దాదాపు నెల రోజులవుతోంది కనీసం ఒక ఫొటో కూడా విడుదల చేయలేదు.

కాకపోతే ట్విట్టర్ లో అప్ డేట్స్ మాత్రం ఓ రేంజ్ లో వదులుతున్నాడు. మొదట్లో కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న సహాయ కార్యక్రమాలను రీట్వీట్ చేసిన పవన్, జనసేన నాయకుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తమవారు చేస్తున్న పనుల్ని కూడా హైలెట్ చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూసి నెటిజన్లు ఒక్కసారైనా పవన్ కనిపించాలని కోరుతున్నారు.