జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన నివాసం లో దీక్ష మొదలుపెట్టారు. తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి అండగా పవన్ దీక్ష చేపట్టారు. నివర్ తుఫాన్ బాధితుల్ని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచి.. డిసెంబర్ 6 వరకు అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో దీక్షకు దిగారు.
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా రూ.35వేలు, తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిమాండ్ కు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా తన నివాసంలో ఉదయం 10గం.లకు దీక్షలో కూర్చున్నట్లు పార్టీ ప్రకటించింది.ఈ దీక్ష ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనుంది.