Site icon TeluguMirchi.com

వారి ఫోన్స్‌కు పవన్‌ స్పందించడం లేదట!!

pawan-janasenaఏపీ మంత్రి వర్గ విసర్తణ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో, ఈసారే మంత్రి పదవి కావాల్సిందే అంటూ పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. అయితే ఎక్కువ మందికి చంద్రబాబు నిరాశ కలిగించక తప్పలేదు. చంద్రబాబు నాయుడు 11 మంది కొత్త మంత్రులకు స్థానం కల్పించినా కూడా ఇంకా పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం దాదాపు 30 మంది తెలుగు దేశం ఎమ్మెల్యేలు మరియు ఇతర నాయకులు గోడ దూకేందుకు గోడ ఎక్కి మరీ కూర్చుని ఉన్నారు. అయితే వారు ఏ పార్టీలో దూకాలి అనే విషయాన్ని తేల్చుకోలేక పోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీలోకి వెళ్లడం మంచిది. అయితే ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు మొదలు కాలేదు. మరో వైపు తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పవన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే వారికి పవన్‌ అందుబాటులోకి రావడం లేదు. దాంతో వారు తెలుగు దేశంలోనే కొందరు కంటిన్యూ అవ్వడం, కొందరు వైకాపాను చేరే అవకాశాలున్నాయి. జనసేన పార్టీలోకి అలాంటి పాత రక్తం ఏమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Exit mobile version