Site icon TeluguMirchi.com

పవన్ డిమాండ్ వెనక ఉండవల్లి ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేసేందుకు ‘జేఏసీ’ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన లోక్ సత్తా అధినేత జేపీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర నిధులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల విషయంలో భాజాపా, టీడీపీ నేతలు చెప్పే లెక్కల్లో ఏ మాత్రం పొంతన లేదు. కేంద్రం కూడా ఇప్పటికే ఏపీకి చాలా ఇచ్చామని చెప్పుకొంటోంది. ఈ నేపథ్యంలో పవన్ చేసిన డిమాండ్ ప్రాధాన్యతని సంతరించుకొంది. పవన్ డిమాండ్ పై చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ? కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తుందా ?? అన్నది ఆసక్తిగా మారింది.

మరోవైపు, పవన్ డిమాండ్ వెనక ఉండవల్లి అస్తం ఉందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఉండల్లి పవన్ తో బేటీ అయిన తర్వాత ఈ డిమాండ్ ని తెరపైకి తెచ్చాడు పవన్. ఈ నేపథ్యంలోనే పవన్ ఉండవల్లి ఈ డిమాండ్ చేయించాడనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. ఇన్నాళ్లు టీడీపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న పవన్.. ఆ పార్టీకి దూరమయ్యే సమయం వచ్చిందనే చెప్పవచ్చు.

Exit mobile version