జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొన్నటి ఎన్నికల తర్వాత జనసేన పార్టీని తమ పార్టీలో విలీనం చేయాల్సిందిగా ఒక పెద్ద పార్టీకి చెందిన నాయకులు నన్ను పదే పదే అడుగుతున్నారు. వారు నాకు ఏవో ఆఫర్లు ఇస్తూ విలీన ప్రతిపాధన తీసుకు వస్తున్నారు. కాని నేను మాత్రం జనసేన పార్టీని అస్సలు విలీనం చేసేందుకు సిద్దంగా లేను అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. తనను బెదిరించినా ఏం చేసినా కూడా తాను మాత్రం జనసేన పార్టీని ఏ పార్టీలో కూడా విలీనం చేసే ప్రసక్తే లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
నేడు విజయవాడ పార్లమెంటు పరిధి పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి మనో ధైర్యంతో సమస్యలపై పోరాడదాం అంటూ కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చాడు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశాడు. అయితే పవన్‌ను బలవంత పెడుతున్న ఆ పెద్ద పార్టీ ఏది అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పెద్ద పార్టీలు అంటే బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు. అందులో కాంగ్రెస్ పరిస్థితి అస్సలు బాగాలేదు. మరి ఉన్నది బీజేపీ, వారు మాత్రమే పవన్ నుండి సహకారం కోరుకుంటున్నారు. పవన్‌కు సీఎం పీఠం ఇచ్చేందుకు కూడా వారు ఓకే చెప్పి పార్టీ విలనం కోరుతూ ఉంటారు అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.