వాన ను సైతం లెక్కచేయని పవన్

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టూర్ లో ఉన్నాడు. గురువారం కృష్ణా జిలాల్లో పర్యటించి తుఫాన్ బాధితులను పరామర్శించగా..శుక్రవారం చిత్తూరు జిల్లాలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని పోయ గ్రామంలో పర్యటించారు. భారీ వర్షం కురుస్తున్నా తడుస్తూనే పవన్ తన దూకుడు కొనసాగించారు. ఓ వైపు వైసీపీ శ్రేణులకు వార్నింగ్ ఇస్తూ, మరోవైపు తుఫాను ప్రభావిత రైతులను పరామర్శించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం రూ.35 వేల పరిహారం ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపై వారికి అండగా ఉండేందుకు ఎంతదూరమైనా వెళ్తామన్నారు.

చిత్తూరు జిల్లాలో తన పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతాంగాన్ని పరామర్శించేందుకు వచ్చిన తనను అడ్డుకోవడం సరికాదన్నారు. దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దమ్ముంటే రైతులను పరామర్శించే తన పర్యటన అడ్డుకోండంటూ వైసీపీ‌కి పవన్ సవాల్ విసిరారు.