మరోసారి ఏపీలో వైసీపీ పార్టీ సత్తా చాటింది. రీసెంట్ గా జరిగిన స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని ప్రతిపక్షాలకు చెమట్లు పట్టించిన జగన్..మున్సిపల్ ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అన్ని స్థానాల్లో వైసీపీ విజయడంకా మోగించింది. ఈ విజయం తో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటుంటే..ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంది.
వైసీపీ విజయం పట్ల జనసేనాధినేత పవన్ స్పందించారు. బెదిరింపులు, దౌర్జన్యాలతోనే వైసీపీకి అత్యధిక స్థానాలు లభించాయని ఆరోపించారు. పథకాలు అందకుండా చేస్తామని వైసీపీ నేతలు బెదిరించింది నిజం కాదా అని పవన్ ప్రశ్నించారు. రేషన్ కార్డులు నిలిపివేస్తామని, పెన్షన్లు రాకుండా చేస్తామని, విద్యా పథకాలు ఆపేస్తామని వైసీపీ నేతలు ప్రజలను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని పవన్ మండిపడ్డారు. ఇవి ప్రజల్లో నమ్మకం కలిగించి సాధించిన ఓట్లు కాదని, ఓటర్ల కడుపుపై కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి సంపాదించిన ఓట్లని విమర్శించారు.