పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఆర్దిక శాఖ 200 కోట్లు విడుదల చేసింది.ప్రభుత్వం ప్రతిష్టా త్మకం గా తీసుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా డెల్టా ప్రాంతంతో పాటుగా రాయలసీమకు నీరు అందనుంది. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసి ట్రైల్ రన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం 200 కోట్లు అదనపు నిధులు విడుదల చేయాలని పోలవరం ఇంజనీర్ ఇన్ ఛీఫ్ చేసిన ప్రతిపాదనలను ఏపి ఆర్దిక శాఖ ఆమోదిస్తూ 200 కోట్లు అదనపు నిధులు విడుదల చేసింది.అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో హుదుద్ తుఫాను కారణంగా నష్టపోయిన 16972 హెక్టార్లలోని రైతుల కోసం 25.46 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసింది ఏపి ఆర్దిక శాఖ. విశాఖ సైబర్ స్టేషన్ కోసం అవసరమైన నిధులకు ఆర్దిక శాఖ ఆమోద ముద్ర వేసింది..