Site icon TeluguMirchi.com

సమైక్య వాదం మా నినాదం : సీఎం

kiranసమైక్యం తమ నినాదం కాదని అది తమ విధానమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడించిందని తెలిపారు. కానీ జాతీయ పార్టీగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తమ పార్టీ పై ఒత్తిడి అధికంగా ఉందని అన్నారు. అయినప్పటికీ అధిష్ఠానం నిర్ణయాన్ని తామంతా తీవ్రంగా వ్యతిరేకించామని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలంతా ఎంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిందని అన్నారు. పునర్వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదాపై అసెంబ్లీలో, శాసన మండలిలో తమ అభిప్రాయాలు వెల్లడించాల్సిన బాధ్యత అందరిమీదా ఉందని తెలిపారు.

శాసనసభలో చర్చను అడ్డుకుంటూ విభజనకు టీడీపీ, వైఎస్సార్సీపీలు సహకరిస్తున్నాయని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బిల్లుపై చర్చించ లేదంటే దానిని ఆమోదంగా పరిగణించే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. శాసనసభలో అభిప్రాయం చెప్పకపోతే వైఎస్సార్సీపీ గతంలో సూచించినట్టు ఆర్టికల్ 3 ప్రకారం విభజన జరిగే అవకాశం ఉందని అలాంటి ప్రమాదం రాకుండా చర్చలో పాల్గోవాలని టీడీపీ, వైఎస్సార్సీపీలకు సూచించారు. అసెంబ్లీలో ప్రజాభీష్టాన్ని ప్రతిబింబింపజేసి విభజనను అడ్డుకోవాలని ఆయన కోరారు.

Exit mobile version