పార్లమెంట్ సమావేశాలు షురు!

parliament-meetingsనేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బిల్లుతో పాటుగా, మరో ఆరు అవినీతి నిరోధిక బిల్లులు పార్లమెంట్ కు రానున్న నేపథ్యంలో.. ఈ సమావేశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 15వ లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు. దీంతో.. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు తమదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా  పార్లమెంట్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కమల్ నాథ్, లోక్ సభ స్వీకర్ మీరాకుమార్ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా టీ-బిల్లు పార్లమెంట్ ను కుదిపేయనుంది. సొంతపార్టీ నేతలే బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. సభ ఏ మేరకు సజావుగా సాగే అవకాశాలున్నాయన్నది ప్రశ్నార్థకమే.