Vijayawada Alert : అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వారి వాహనాలను ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి


భవానీ దీక్షల సందర్భంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు నగర CP కాంతిరాణా టాటా వెల్లడించారు. బుధవారం రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. భారీ వాహనాలను నగరంలోకి రాకుండా దారి మళ్లించనున్నట్లు చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల కోసం 8ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ మేరకు ఏ ప్రాంతం నుంచి వచ్చేవారు ఎక్కడ వాహనాలు పార్కింగ్ చేయాలనే విషయాలను CP వెల్లడించారు

విజయవాడ నగర పరిధి వాహనాలు – గాంధీ మున్సిపల్ హైస్కూల్ కేంద్రంలో పార్క్ చేసుకోవాలి

హైదరాబాద్, జగ్గయ్యపేట, తిరువూరు వైపు నుంచి వచ్చే వాహనాలు – పున్నమి ఘాట్, భవానీ ఘాట్, సుబ్బారాయుడికి చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పార్క్ చేసుకోవాలి

విశాఖపట్నం,శ్రీకాకుళం,విజయనగరం,తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి నుంచి వచ్చే వాహనాలు – సితార సెంటర్ సమీపంలోని పాత సోమా కంపెనీ స్థలంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పార్క్ చేసుకోవాలి

మచిలీపట్నం,గుడివాడ,అవనిగడ్డ నుంచి వచ్చే వాహనాలు-BRTS రోడ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో పార్క్ చేసుకోవాలి

గుంటూరు, ప్రకాశం, రాయలసీమ నుంచి వచ్చే వాహనాలు – వారధి జంక్షన్ వద్ద ‘ఉడా’ స్థలం, కృష్ణలంక సర్వీస్ రోడ్డులోని ఎం హోటల్ నుంచి నల్లగేట్ వరకు పార్క్ చేసుకోవాలి.