అధిష్టానానికి అండగా..

panabaka-laxmiరాష్ట్ర విభజన నేపథ్యంలో.. పార్టీ నేతలంతా ప్రాంతాల వారీగా చీలిపోయారు. సొంత పార్టీ ఎంపీలూ, మంత్రులు అధిష్టానానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఒక్కరు తప్ప. ఆమె కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ. ఆది నుంచి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి వుంటాని చెబుతూ వస్తున్నారు పనబాక. తాజాగా, విభజనకు అనుకూలంగా ఓటు వేస్తున్నాని కూడా స్పష్టం చేశారు.

అయితే, మంత్రి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీమాంధ్ర ప్రజలు. సీమాంధ్రకు చెందివారై ఉండి కూడా విభజనకు సపోర్ట్ చేయడాన్ని సీమాంధ్ర ఉద్యమకారులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇకపై ఢిల్లీలోనే పోటీ చేయాలని, సీమాంధ్రలో కాలుపెడితే.. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇవేవి పనబాకకు కొత్తమీ కాదు. గతంలోను ఆమెను అడ్డుకున్నారు సమైక్యవాదులు. ఎవరడ్డుకున్నా, ఏమనుకున్నా డోంట్ కేర్ లాగా వ్యవహరిస్తున్నారు పనబాక. అధిష్టానానికి అండగా వుండటమే ఆమె ధ్యేయమట.