Site icon TeluguMirchi.com

పాకిస్తాన్‌, అఫ్గనిస్తాస్తాన్‌లో భారీ భూకంపం


పాకిస్తాన్‌, అఫ్గనిస్తాస్తాన్‌లో పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.5గా నమోదైంది. రాత్రి 10.20గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనాలు దెబ్బతినడం, కొండచరియలు విరిగిపడడంతో నివాసితులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాక్‌లో భూకంపం దాటికి ఇద్దరు మహిళలు సహా ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా 160 మందికిపైగా గాయపడ్డారు. అఫ్గనిస్తాన్‌, ఈశాన్య లాగ్మాన్ ప్రావిన్స్‌లో ఇద్దరు మరణించగా ఎనిమిదిమంది గాయపడ్డారు.

Exit mobile version