జవాన్లపై దాడికి మాకు సంబంధం లేదు : పాక్

heen rabbaniభారత జవాన్లపై దొంగచాటుగా దాడికి పాల్పడి ఇద్దరు జవాన్లను అతికీరాతకంగా చంపి వారిలో ఒకరి తలను తీసుకెళ్ళిన సంఘటనపై యావత్ భారతదేశం స్పందించింది. పాకిస్థాన్ తో భారత్ శాంతి చర్చలంటూ స్నేహ హస్తం అందిస్తుంటే పాక్ స్థాన్ మాత్రం ఇలాంటి క్రూరమైన సంఘటనలకు పాల్పడి కుక్కు తోక వంకర అన్నట్లు ప్రవర్తిస్తుంది.

తాజాగా ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి హీనారబ్బాని ఖర్ భారత్ జవాన్లపై పాక్ సైనికుల దాడిని ఖండించారు. భారత్ ఆరోపిస్తున్నట్లు భారత జవాన్లపై దాడికి తెగబడింది తాముకాదని పేర్కొన్నారు. తాము ఇంకా 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబట్టుబడి ఉన్నామని ఆమె మీడియాకు వివరణ కూడా ఇచ్చారు.  ఈ విషయంపై భారత్ ఇంకా నమ్మకపోతే థర్డ్ పార్టీ చేత విచారణకైనా పాక్ సిద్దమే అని భారత్ కు సవాల్ విసిరారు. భారత భూభాగంలో సంఘటన జరిగింది కనుక దానితో తమకే సంబంధం లేదని చెప్పుకొచ్చారామె. అయితే భారత్-పాక్ ల మధ్య ఇతర రాజ్యాల మధ్యవర్తిత్వాలను స్వాగతించని భారత్ ఈ సవాల్ కు అంగీకరించదన్న ధీమాతో హీనా రబ్బాని ఇలా బహిరంగంగా సవాల్ విసిరి వుండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు భారత జవాన్ల పైన తాము దాడి చేయలేదన్న పాకిస్తాన్ వ్యాఖ్యల్ని రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ తోసిపుచ్చారు. ఇద్దరు జవాన్లను హతమార్చి, మృతదేహాలను ఛిన్నాభిన్నం చేయడం వెనుక పాక్ హస్తమున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అమానవీయంగా ప్రవర్తించిందని మండిపడ్డారు.