పాక్ కొత్త జపం !

nawaz_sharifసరిహద్దు ప్రాంతంలో పలుమార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించి.. తన పైచాచికత్వాన్ని నిరూపించుకున్న పాక్ కొత్త జపం మొదలెట్టింది. భారత్ తో కొత్తగా చర్చలు ప్రారంభిస్తామని ముందుకొచ్చింది. దీనివల్ల భారత్, పాక్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగవుతాయని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పేర్కొన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ (ఏపీపీ) తన కథనంలో పేర్కొంది. సరిహద్దులో జరుగుతున్న ఘటనలపై ఇరుదేశాలు శాంతి, స్నేహభావంతో చర్చించుకోవాలని షరీఫ్ కోరినట్లు తెలిపింది. అయితే, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరు దేశాల భేటీలో కాల్పుల ఉల్లంఘనపై చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు.