తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. సామాన్య ప్రజలే కాదు రాజకీయ నేతలు సైతం దీనిబారిన పడుతున్నారు. ఇప్పటికే హోం శాఖమంత్రి మహమూద్‌అలీ, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌లకు పాజిటీవ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది.
మూడు రోజుల నుంచి జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పద్మారావుతో పాటు మరో నలుగురు కుటుంబసభ్యులకు సైతం కొవిడ్ పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని క్వారంటైన్ సెంటర్‌లో ఉన్నట్లు సమాచారం.