వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అందజేసే వివిధ పురస్కారాలను అన్నింటిని కలిపి ఒకే వేదిక కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ను ఆరంభించింది. ఈ విధానంలో ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా ఉండడానికి ఈ పోర్టల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పౌరుడు, సంస్థ, వ్యక్తులను, సంస్థలను ప్రభుత్వం అందించే పురస్కారాల కోసం నామినేట్ చేయడానికి ఈ వేదిక దోహదపడుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోర్టల్ లో పద్మ పురస్కాల కోసం నామినేషన్లు, సిఫారసులకు వచ్చే నెల 15వ తేది వరకు అందుబాటులో ఉండగా, జీవన్ రక్షా పధక్ కోసం వచ్చే నెల 30వ తేది వరకు గడువు ఉంది.