కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రస్తుతం విధిస్తున్న లాక్ డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరింత పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తొలుత విధించిన 21 రోజుల లాక్ డౌన్ గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఇంకా కొవిడ్ కేసులు పెరుగుతుండడం, చనిపోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి .
ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాలకు పలు సూచనలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ఒకవేళ లాక్‌డౌన్‌ను ఎత్తి వేయకపోతే పేదల ఖాతాల్లో రూ.5,000 వేయాలి’ అని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న కరోనా జిహాద్‌పై ఒవైసీ మాట్లాడుతూ… ‘ఇటువంటి పనులకు పాల్పడుతున్న వారు దేశాన్ని బలపర్చట్లేదు. జనవరి 1 నుంచి మార్చి 15 వరకు దేశానికి 15 లక్షల మంది విదేశాల నుంచి వచ్చారు. కానీ, తబ్గిగీ జమాత్‌ను మాత్రమే ఎత్తి చూపెడుతున్నారు.” అని చెప్పుకొచ్చారు