తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులతో మోస్రా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ దేవస్థానంను ఈరోజు ప్రారంభించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. మోస్రా గ్రామస్థులు కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ. 33.60 లక్షలను పెద్దమ్మ దేవాలయం కోసం మంజూరు చేయించారు. గ్రామస్థులు తమ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ గా రూ. 8.40 లక్షలను అందించారు.
పెద్దమ్మ దేవస్థానం ప్రతిష్ట సందర్భంగా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి అనుగ్రంతో, ఆ తల్లి కృపా కటాక్షాలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ ఆనందంగా వుండాని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మొస్రా జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మొస్రా ఎంపీపీ ఉమా శ్రీరాములు, సర్పంచ్ సుమలత రాం రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షులు శ్రీరాములు, మండల పార్టీ అధ్యక్షులు హన్మంత్ రెడ్డి,మండల ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.