ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు తప్పనిసరి : తెలంగాణ హైకోర్టు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది, రోజు వారి కేసులు లక్ష దాటుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలను 70 శాతం పెంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలుగా మారాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది. కరోనా కట్టడికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.